logo

అభ్యర్థుల ఓటుబాట

జిల్లాలో గురువారం జరిగిన ఎన్నికల పోలింగ్‌లో పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Published : 01 Dec 2023 04:43 IST

కాగజ్‌నగర్‌లో ఓటు వేసిన సిర్పూరు భారాస అభ్యర్థి కోనేరు కోనప్ప, ఆయన సతీమణి రమాదేవి, తనయుడు కోనేరు వంశీ- మధుళిక దంపతులు

ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే: జిల్లాలో గురువారం జరిగిన ఎన్నికల పోలింగ్‌లో పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొందరు కుంటుంబ సమేతంగా కేంద్రాలకు రాగా కొందరు ఒంటరిగా వచ్చి ఓటు వేసి వెళ్లారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ ఆదర్శ పోలింగ్‌ కేంద్రంలో జిల్లా ఎన్నికల అధికారి హేమంత్‌ బోర్కడే, సతీమణి రేవతితో కలిసి వచ్చి ఓటు వేశారు. అదే పోలింగ్‌ కేంద్రంలోని మరో బూత్‌లో జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్‌ టిబ్రేవాల్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి సోదరి మర్సుకోల సరస్వతి ఓటుహక్కు వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఆసిఫాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి అజ్మీరా శ్యాంనాయక్‌, తిర్యాణి మండలం మందగూడ గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఆసిఫాబాద్‌ భారాస అభ్యర్థి కోవ లక్ష్మి కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు వేశారు. అదే మండలం లక్ష్మిపూర్‌ గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఓటుహక్కు వినియోగించుకున్నారు. రెబ్బెన మండలం గోలేటి టౌన్‌షిప్‌ సింగరేణి పాఠశాలలో ఆసిఫాబాద్‌ భాజపా అభ్యర్థి అజ్మీరా ఆత్మారాంనాయక్‌ ఓటు వేశారు. సిర్పూర్‌ భారాస అభ్యర్థి కోనేరు కోనప్ప, బీఎస్పీ సిర్పూరు అభ్యర్థి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌లు ఫాతిమా కాన్వెంట్‌లో, కాంగ్రెస్‌ అభ్యర్థి రావి శ్రీనివాస్‌ సర్‌సిల్క్‌ కాలనీ శిశుమందిర్‌లో, భాజపా అభ్యర్థి హరీశ్‌బాబు బెజ్జూరు మండలం రెబ్బెనలో ఓటుహక్కు వినియోగించుకున్నారు.

కాగజ్‌నగర్‌లో.. కాంగ్రెస్‌ అభ్యర్థి రావి శ్రీనివాస్‌- సునీత దంపతులు

తిర్యాణి మండలం మందగూడలో ఓటు వేస్తున్న ఆసిఫాబాద్‌ భారాస అభ్యర్థి కోవ లక్ష్మి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు