logo

నిండుగా.. ఓట్ల పండగ..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. తొలిసారి ఓటువచ్చిన కొత్త ఓటరు మొదలు..వంద సంవత్సరాల వృద్ధుల వరకు బాధ్యతగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

Updated : 01 Dec 2023 06:13 IST

ప్రశాంతంగా ముగిసిన ప్రజాస్వామ్య క్రతువు..

వడ్‌గాంలో బారులు తీరి..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. తొలిసారి ఓటువచ్చిన కొత్త ఓటరు మొదలు..వంద సంవత్సరాల వృద్ధుల వరకు బాధ్యతగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అక్కడక్కడ చెదురుమదురు ఘటననలు మినహా ఎక్కడా పోలింగ్‌కు ఆటంకం కలగలేదు. దారిలేని గూడాలు..మారుమూల ప్రాంతాలు.. పట్టణాల నుంచి జనం ఓటుకోసం పోటెత్తారు. బాలింతలు,గర్భిణులు,వికలాంగుసైతం తమ అసహాయతను పక్కనబెట్టి అభ్యర్థుల భవితను నిర్ణయించేందుకు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. తొలుత మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ప్రక్రియ సమయం గడిచేకొద్దీ ఊపందుకుంది. కొన్నిచోట్ల రాత్రివరకు కూడా వేచిఉండి తమహక్కును వినియోగించారు. అధికార యంత్రాంగం, భద్రతాసిబ్బంది అలుపులేకుండా తమ విధులు నిర్వర్తించారు..

రెండు చేతుల్లేకపోయినా..!

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నరేశ్‌. నిర్మల్‌ పట్టణానికి చెందిన ఈయన గతంలో జరిగిన ఓ విద్యుత్తు ప్రమాదంలో రెండు చేతులు (మణికట్టు భాగం వరకు) కోల్పోయాడు. ఈయన గురువారం జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తన బాధ్యతను నిర్వర్తించాడు. బుధవార్‌పేట్‌ విధాత పాఠశాలలోని పోలింగ్‌బూత్‌ 201లో ఆయన పాల్గొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా చాలామంది ఓటేయడానికి బద్ధకించారు. అలాంటివారికి ఈయన స్ఫూర్తిగా నిలిచారు.

కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మార్కెట్‌ ఏరియాలోని పోలింగ్‌ బూత్‌లో ఉదయం విద్యుత్తు అంతరాయం కారణంగా సిబ్బంది ఓటర్లు ఇబ్బంది పడ్డారు. సెల్‌ఫోన్ల టార్చ్‌లైట్‌లో ప్రక్రియ కొనసాగించారు.

వందేళ్లు దాటినా..  

ఉట్నూరు మండలం లక్కారంలో నివాసం ఉంటున్న దూట రాజవ్వకు 103 సంవత్సరాలు. తాను ఎలాగైనా ఓటేస్తానని తన కొడుకు దూట మహేందర్‌ను కోరగా ఆయన ఆటోలో తీసుకొచ్చి పోలింగ్‌ కేంద్రం వరకూ ఎత్తుకొచ్చి ఓటు వేయించారన్నారు. తనకు ఓటేయడం ఆనందంగా ఉందని అవ్వ నవ్వుతూ తెలిపారు.

ఓటేసేందుకు స్వగ్రామాలకు తరలిరావడంతో కిక్కిరిసిన ఆదిలాబాద్‌ ప్రయాణ ప్రాంగణం

ఎడ్లబండిలో 3 కిలోమీటర్ల దూరంలోని అంబుగామ్‌ కేంద్రానికి వెళ్తున్న వామన్‌నగర్‌ సీతారాం కుటుంబీకులు

ఆదిలాబాద్‌ : కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌,  శ్రీజ దంపతులు

మామడ: ఓటు హక్కు వినియోగించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి రావు, కుమార్తె డా.స్నేహ

నస్పూరులో ఓటు వేసి సిరా గుర్తు చూపుతున్న పాలనాధికారి బదావత్‌ సంతోష్‌ దంపతులు

ఆసిఫాబాద్‌ జన్కాపూర్‌ ప్రాథమిక  పాఠశాల పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన కుమురం భీం కలెక్టర్‌ దంపతులు హేమంత్‌ బోర్కడే, రేవతి

ఆదిలాబాద్‌ : ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి

చెన్నూరు : పొక్కూరులో పసిపాపతో ఓటు వేసేందుకు వచ్చిన మహిళ

తాంసిలో అయ్యప్ప స్వాములు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు