logo

విధుల నుంచి వైద్యులను తొలగించడాన్ని నిరసిస్తూ రిమ్స్ లో ఆందోళన

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని ఎలుకలు కొరికిన ఘటన కలకలం రేపింది.

Published : 12 Feb 2024 11:34 IST

ఎదులాపురం :  కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని ఎలుకలు కొరికిన ఘటన కలకలం రేపింది. దీంతో  ఇద్దరు వైద్యులను విధుల నుంచి తొలగించారు. వైద్యులను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ రిమ్స్ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. టీటీడీఏ అధ్యక్ష, కార్యదర్శులు  ఇద్రిస్ అక్బాని, సుమలత ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు ధరించి ప్రదర్శన చేపట్టారు. రోగుల  బాధ్యత పారిశుద్ధ్య ఏజెన్సీది అయినప్పుడు వైద్యులను ఎలా సస్పెండ్‌ చేస్తారని ప్రశ్నించారు. వెంటనే సస్పెన్షన్‌ను  ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని