logo

మది నిండుగా.. తల్లుల దర్శనం

వనదేవతలు కొలువు దీరడంతో శుక్రవారం మేడారం జాతర నిండుదనాన్ని సంతరించుకుంది. అమ్మల దర్శనానికి భక్తులు పోటెత్తారు.. గద్దెల ప్రాంగణం రోజంతా కిక్కిరిసిపోయింది. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకు  భక్తులు మొక్కులు సమర్పించారు.

Published : 24 Feb 2024 05:15 IST

వనదేవతలు కొలువు దీరడంతో శుక్రవారం మేడారం జాతర నిండుదనాన్ని సంతరించుకుంది. అమ్మల దర్శనానికి భక్తులు పోటెత్తారు.. గద్దెల ప్రాంగణం రోజంతా కిక్కిరిసిపోయింది. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకు  భక్తులు మొక్కులు సమర్పించారు.

కిక్కిరిసిన క్యూలైన్లు (శుక్రవారం వేకువజామున 5 గంటలకు)

  • జంపన్నవాగు జనసంద్రంగా మారింది. పుణ్యస్నానాలు చేసి భక్తులు తరించారు.
  • తిరుగు పయనంలో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం కిటకిటలాడింది. బస్సుల్లో సీట్ల కోసం కిటికీల్లోంచి ఎక్కుతూ కనిపించారు.
  • మేడారం వినువీధిలో హెలికాప్టర్లు సందడి చేశాయి. జాయ్‌ రైడ్లతో భక్తులు వినోదాన్ని పొందారు.

తల్లి దీవెనలు ఉండాలి

బెలూన్‌ల రహస్యం తెలుసుకుందాం...

మేడారం(డోర్నకల్‌), న్యూస్‌టుడే: జాతరలో అక్కడక్కడ ఆకాశంలో ఎగురుతూ బెలూన్లు కనిపిస్తుంటాయి. వీటి వెనకాల ఉన్న అసలు రహస్యం చాలా మందికి తెలియదు. ప్రతి బెలూన్‌పై ఒక సంఖ్య ఉంటుంది. ఎవరైనా దారి తప్పినా లేదా వారు ఉన్న ప్రదేశాన్ని ఇతరులకు తెలియజేయాలన్నా ఈ బెలూన్లపై ఉన్న నెంబరు చెబితే సదరు వ్యక్తులు వెంటనే అక్కడికి చేరుకోవచ్చు.

ఎదుర్కోలు మొక్కు చెల్లిస్తున్న యువతి

వన దేవతలకు కళాభివందనం

న్యూస్‌టుడే,  మంగపేట: మేడారం జాతరలో ఆదివాసీ నృత్యాలు వారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి.. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు ఇస్తూ తల్లుల గొప్పతనాన్ని చాటుతున్నారు. ఆదివాసీ నృత్యాలైన డోలీ, థింసా, రేలా, కొమ్ము, గుస్సాడీ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

భక్తి పారవశ్యం

నక్క తోక తొక్కి చూద్దాం!

న్యూస్‌టుడే, మేడారం (కాజీపేట): అనుకోకుండా అదృష్టం వరిస్తే నక్క తోక తొక్కాడని అంటారు. అందుకే మేడారం వచ్చిన భక్తులు కోయదొరల వద్ద ఉండే నక్క తోకను డబ్బులిచ్చి మరీ తొక్కుతున్నారు. ఒకరికి అయితే రూ.100, కుటుంబానికి రూ.200 చొప్పున కోయదొరలు తీసుకుంటున్నారు. నక్క తోక కొనుగోలు చేయాలంటే రూ.1000 చెల్లించాలి.

వివిధ తెగల  ఇలవేల్పుల సమ్మేళన ప్రదర్శన

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి నుంచి..

మేడారం ఆడిటోరియం వద్ద థింసా నృత్యం ప్రదర్శిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అరకుకు చెందిన ఆదివాసీ మహిళలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని