logo

చెవిలో పువ్వులతో వినూత్నంగా నిరసన

ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో కొనసాగుతున్న రిలే దీక్షలో సాధన...

Updated : 29 Feb 2024 13:53 IST

ఎదులాపురం: ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో కొనసాగుతున్న రిలే దీక్షలో సాధన కమిటీ సభ్యులు గురువారం చెవిలో పువ్వులతో వినూత్నంగా నిరసన తెలిపారు. సాధన కమిటీ ఛైర్మన్ సిర్ర దేవేందర్, ప్రధాన కార్యదర్శి నిమ్మల నరేందర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు 45వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా సిర్ర దేవేందర్ మాట్లాడుతూ.. వచ్చే నెల 4న జిల్లాకు రానున్న ప్రధాని మోదీ ఆదిలాబాద్-ఆర్మూర్ రైల్వే లైన్ గురించి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే ఆందోళనలు ఉద్ధృతం చేసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిని ఓడిస్తామని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని