logo

తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ధర్నా

ఆదిలాబాద్‌ రిమ్స్ ఆస్పత్రిలో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు.

Published : 03 Apr 2024 10:15 IST

ఎదులాపురం: ఆదిలాబాద్‌ రిమ్స్ ఆస్పత్రిలో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు.  రిమ్స్ కాంట్రాక్టర్ వైఖరిని ఖండిస్తూ బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిలోని ఔట్ పేషెంట్ బ్లాక్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న కార్మికులను చిన్నచిన్న కారణాలతో  తొలగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ జీవో ప్రకారం వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికైనా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న, నవీన్ కుమార్ దేవీదాస్, అక్రమ్, లక్ష్మి, తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని