logo

మావోయిస్టుల డంప్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు

 జీకే వీధి మండలం పనసలబంద గ్రామ  పరిసరా అటవి ప్రాంతంలో మావోయిస్టు డంప్‌ను  స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా తెలిపారు. 

Published : 25 May 2024 13:59 IST

పాడేరు పట్టణం:  జీకే వీధి మండలం పనసలబంద గ్రామ  పరిసరా అటవి ప్రాంతంలో మావోయిస్టు డంప్‌ను  స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా తెలిపారు. 

మండలంలోని గాలికొండ పంచాయతీ  సీలేరు పోలీసు స్టేషన్‌ పరిధిలో గల పనసలబండ  అటవి ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఈ డంప్‌ను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఆ డంప్‌లో పేలుడు పదార్థాలతో పాటు 150 మీటర్ల పొడవు కలిగిన ఎలక్ట్రికల్‌ వైరు, మేకులు, ఇనుప నట్లు, మావోయిస్టుల సాహిత్య పత్రాలు ఉన్నట్లు ఎస్పీ వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు