logo

విద్యుత్తు తీగ తగిలి బాలుడికి తీవ్రగాయాలు

విద్యుత్తు తీగలు తగిలి బాలుడికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

Published : 29 Mar 2023 02:22 IST

పొలాల వద్ద నుంచి బాలుడ్ని మోసుకొస్తున్న కుటుంబ సభ్యులు

హుకుంపేట, న్యూస్‌టుడే: విద్యుత్తు తీగలు తగిలి బాలుడికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మత్య్సపురం గ్రామానికి చెందిన సుమతి, బొజ్జన్నల కుమారుడు జి.అజయ్‌ మంగళవారం పెదగరువు వంతెన సమీపాన కొందరు పిల్లలతో ఆడుకుంటున్నాడు. అంతలోనే అతనికి విద్యుత్తు తీగ తగిలింది. అతడితో పాటు ఆడుకుంటున్న మిగిలిన పిల్లలు వచ్చి ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి చేతిపై తీవ్ర గాయాలు కావడంతో 108కు సమాచారం అందించారు. వైద్య సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని బాలుడిని పాడేరు జిల్లా ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అజయ్‌ హుకుంపేటలో ఆరో తరగతి చదువుతున్నాడని బాలుడి తల్లి సుమతి తెలిపారు. పెదగరువు వంతెన సమీపంలో విద్యుత్తు తీగలు బాగా కిందకు వేలాడుతున్నాయని, అధికారులు స్పందించి వీటిని సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని