logo

Alluri Dist: వ్యూస్‌ కోసం వన్యప్రాణి వేట.. ముగ్గురు యూట్యూబర్ల అరెస్టు

వన్యప్రాణి ఉడుమును వేటాడి దాని మాంసం తిన్న వీడియోను యూట్యూబ్‌లో పెట్టినందుకు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు అనంతగిరి అటవీశాఖ రేంజర్‌ దుర్గాప్రసాద్‌ తెలిపారు.

Updated : 30 Sep 2023 07:02 IST

అనంతగిరి, న్యూస్‌టుడే: వన్యప్రాణి ఉడుమును వేటాడి దాని మాంసం తిన్న వీడియోను యూట్యూబ్‌లో పెట్టినందుకు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు అనంతగిరి అటవీశాఖ రేంజర్‌ దుర్గాప్రసాద్‌ తెలిపారు. ‘ఇటీవల ‘అరకు ఏజెన్సీ ఏ టూ జడ్‌’ యూట్యూబ్‌ ఛానల్‌లో ఉడుము మాంసం వండుకుని తినే విధానంపై వీడియోను అప్‌లోడ్‌ చేశారు. వన్యప్రాణి చట్టం ప్రకారం వాటిని వేటాడటం,  మాంసం తినటం నేరం. వీడియోలో ఉన్న ముగ్గురు వ్యక్తులపై ఆరా తీశాం. జిల్లాలోని అనంతగిరి పంచాయతీ లక్ష్మీపురం గ్రామానికి చెందిన నందుల అప్పలరాజు, నందుల సింహాద్రిబాలతోపాటు మరో బాలుడిని అదుపులోకి తీసుకున్నాం. వారిని కోర్టులో హాజరుపరచగా ముగ్గురికీ రిమాండ్‌ విధించారు. బాలుడిని జువైనల్‌ హోంకు, ఇద్దరు యువకులను విశాఖ కేంద్ర కారాగారానికి తరలించాం’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని