logo

ఓటు నమోదుకు రెండు రోజులే గడువు

కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈనెల 14వ తేదీ సాయంత్రంతో లోపు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Published : 13 Apr 2024 01:17 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈనెల 14వ తేదీ సాయంత్రంతో లోపు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు స్వీకరించనున్నారు. జనవరి 22న తుది ఓటరు జాబితాలను వెలువరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నమోదులకు వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇంత వరకు జిల్లా వ్యాప్తంగా 53057 మంది పేర్లను ఓటరు జాబితాల్లో చేర్చారు. వారిలో కలిపి జిల్లాలో ఓటర్ల సంఖ్య 19.95 లక్షలకు చేరింది. ఈనెల 14 వరకు గడువు ఉన్నందున మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ఓటర్‌ హెల్ప్‌లైన్‌ ద్వారా ఎక్కువ మంది ఓటు నమోదు చేసుకుంటున్నారు. తొలగింపులు, మార్పులు, చేర్పులకు ఎటువంటి దరఖాస్తులు స్వీకరించడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని