logo

అప్పుల కారణంగానే ఆత్మహత్య?

ద్వారకానగర్‌లో గురువారం ఉదయం ఏపీఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న కేసులో ద్వారకా స్టేషన్‌ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

Published : 13 Apr 2024 01:18 IST

కానిస్టేబుల్‌ మృతి ఘటనలో కొనసాగుతున్న దర్యాప్తు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ద్వారకానగర్‌లో గురువారం ఉదయం ఏపీఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న కేసులో ద్వారకా స్టేషన్‌ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. చిన్నచిన్న అప్పుల కారణంగానే మనస్తాపంతో కానిస్టేబుల్‌ పాలవలస శంకర్రావ్‌(37) చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతడికి భార్య శ్రావణికుమారి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యతో అన్యోన్యంగా ఉండేవాడని, స్వతహాగా అందరితో కలివిడిగా ఉండే మనస్తత్వం కలవాడని పోలీసులు చెబుతున్నారు. 2010లో ఏపీ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఏపీఎస్‌పీఎఫ్‌) కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరాడు. ప్రస్తుతం ద్వారకానగర్‌ దరి ఓ బ్యాంకు చెస్ట్‌లో కాపలాదారునిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఎప్పటిలాగే గురువారం ఉదయం 5 గంటలకు విధులకు హాజరై ఆరు గంటల సమయంలో  తుపాకీని గుండె వైపు పెట్టుకొని కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. తోటి సిబ్బంది సమాచారం మేరకు కేసు నమోదు చేసిన ద్వారకా స్టేషన్‌ సీఐ రమేశ్‌ దర్యాప్తు చేపట్టారు. అతడి స్నేహితులు పలువురి దగ్గర సుమారు 10 లక్షల వరకు అప్పులు చేశాడని.. అవి తీర్చడంలో అవతలి వ్యక్తుల నుంచి ఎలాంటి ఒత్తిడి లేకపోయినప్పటికీ.. మనస్తాపంతో కాల్చుకున్నట్లు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు