logo

21 ఎకరాల్లో కాఫీ తోటలు దగ్ధం

తమకు జీవనాధారమైన కాఫీ తోటలు అగ్నికి ఆహుతయ్యాయని ఎర్రబొమ్మలు పంచాయతీ బోయలగూడెం గ్రామానికి చెందిన కాఫీ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 13 Apr 2024 01:26 IST

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: తమకు జీవనాధారమైన కాఫీ తోటలు అగ్నికి ఆహుతయ్యాయని ఎర్రబొమ్మలు పంచాయతీ బోయలగూడెం గ్రామానికి చెందిన కాఫీ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం గ్రామానికి చెందిన రైతులు రాంబాబు, దొర తదితరులు మాట్లాడుతూ ఈ నెల 11న రాత్రి సమయంలో సుమారు 21 ఎకరాల కాఫీ తోటలు అగ్నికి ఆహుతయ్యాయని వాపోయారు. గ్రామస్థులందరం ఈ కాఫీ తోటలపైనే ఆధారపడి జీవిస్తున్నామని తెలిపారు. ఐటీడీఏ అధికారులు నష్టపరిహారం అందించి అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. కాఫీ తోటలను పెంచుకునేందుకు ఆర్థికంగా చేయూతనందించాలని విన్నవించుకున్నారు.


తుమ్మలపాలెంలో జీడితోట ..

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: పాడేరు మండలం మారుమూల దేవాపురం పంచాయతీ తుమ్మలపాలెం పరిధిలో జీడితోటలు అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామానికి చెందిన రైతులు రజినిబాబు, నరసింహమూర్తి, పైడితల్లమ్మ, రాజులమ్మలకు చెందిన జీడితోటల్లో శుక్రవారం సాయంత్రం సమయంలో కార్చిచ్చు కారణంగా మంటలు వ్యాపించాయి. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో తోటలు దగ్ధమయ్యాయి. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని