logo

కూటమితోనే ప్రజా సంక్షేమం

తెదేపా- భాజపా- జనసేన కూటమితోనే గిరిజన ప్రాంతంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని కూటమి అభ్యర్థి పాంగి రాజారావు అన్నారు.

Published : 13 Apr 2024 01:41 IST

అరకులోయ, అనంతగిరి, న్యూస్‌టుడే: తెదేపా- భాజపా- జనసేన కూటమితోనే గిరిజన ప్రాంతంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని కూటమి అభ్యర్థి పాంగి రాజారావు అన్నారు. అనంతగిరి మండలంలోని కివర్ల, పినకోట, పెదకోట గ్రామాల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో కోత విధించి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించలేదన్నారు. గిరిజనులకు గతంలో అందిస్తున్న ట్రైకార్‌ రుణాలు, రాయితీలు నిలిపేశారన్నారు. కూటమి అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలెండర్లు, చదువుకునే పిల్లలందరికీ ఏడాదికి రూ. 15 వేలు అందించనున్నట్లు తెలిపారు. తెదేపా నాయకులు బుజ్జిబాబు, ఆనందరావు  తదితరులు  పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు