logo

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తాం

ఎన్నికల్లో తాము గెలుపొందితే పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తామని అరకు లోక్‌సభ, రంపచోడవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థులు కొత్తపల్లి గీత, మిరియాల శిరీషాదేవి హామీ ఇచ్చారు.

Published : 13 Apr 2024 01:42 IST

చింతూరు, ఎటపాక న్యూస్‌టుడే: ఎన్నికల్లో తాము గెలుపొందితే పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తామని అరకు లోక్‌సభ, రంపచోడవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థులు కొత్తపల్లి గీత, మిరియాల శిరీషాదేవి హామీ ఇచ్చారు. శుక్రవారం వీరిద్దరు చింతూరులో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో పాలన నడుస్తోందని, పోలవరం నిర్వాసితులను ప్రభుత్వం నిలువునా ముంచేసిందని ఆరోపించారు. వీరికి పునరావాసం, ప్యాకేజీ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఇప్పటికే పరిహారం పొందిన రైతులకు ఎకరాకు రూ.5 లక్షలు అదనంగా ఇస్తామని ఎన్నికల్లో చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ఎన్నికలు వచ్చినా హామీ  నెరవేర్చలేకపోయారని పేర్కొన్నారు. భాజపా జిల్లా కార్యదర్శి పాయం వెంకయ్య, తెదేపా మండల అధ్యక్షుడు ఇల్లా చిన్నారెడ్డి, జనసేన మండల అధ్యక్షుడు మడివి రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం చింతూరు - మారేడుమిల్లి ఘాట్‌రోడ్‌లో కొలువైన అమ్మవారికి గీత, శిరీషాదేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెదేపా సీనియర్‌ నాయకులు పాటి చలపతిరావు, కిలారు వెంకటేశ్వర్లు, రావి మాధవరావు, వైస్‌ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావు, నలజాల శ్రీకాంత్‌, ఏలూరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని