logo

ఆసరా ఇంకెప్పుడిస్తారు?

నా అక్కా చెల్లెమ్మలకు మంచి చేసే ఉద్దేశంతో రుణమాఫీ ప్రకటిస్తున్నా.. స్వయం సహాయక సంఘాల ద్వారా మీరు తీసుకున్న మొత్తంలో ఎంత బకాయి ఉంటే దాన్ని మీకు తిరిగి చెల్లిస్తాన’ని ఆనాడు ఎన్నికల ప్రచారంలో జగన్‌ హామీ ఇచ్చారు.

Published : 17 Apr 2024 02:04 IST

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ‘నా అక్కా చెల్లెమ్మలకు మంచి చేసే ఉద్దేశంతో రుణమాఫీ ప్రకటిస్తున్నా.. స్వయం సహాయక సంఘాల ద్వారా మీరు తీసుకున్న మొత్తంలో ఎంత బకాయి ఉంటే దాన్ని మీకు తిరిగి చెల్లిస్తాన’ని ఆనాడు ఎన్నికల ప్రచారంలో జగన్‌ హామీ ఇచ్చారు.. వాటిని నాలుగు విడతల్లో చెల్లించేలా ప్రణాళికలు రూపొందించారు. దీనికి వైఎస్‌ఆర్‌ ఆసరా అని పేరు పెట్టారు. నాలుగో విడత ఆర్థికసాయం జమ చేసేందుకు రెండు నెలల క్రితం సీఎం జగన్‌ బటన్‌ నొక్కినా ఇప్పటికీ చాలామందికి రాకపోవడంపై మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చింతపల్లి మండలంలో 298 డ్వాక్రా పొదుపు సంఘాలున్నాయి. చింతపల్లిలోని సాయినగర్‌, రామాలయవీధిలోనున్న 18 పొదుపు సంఘాలకు ఇంత వరకు రుణమాఫీ జరగలేదు. వీరికి సుమారు రూ.40 లక్షల రుణమాఫీ జరగాల్సి ఉంది. వీరంతా మంగళవారం స్థానిక వెలుగు కార్యాలయానికి వచ్చారు. ఇంతవరకు మాఫీ ఎందుకు జరగలేదని వెలుగు అధికారులను ప్రశ్నించారు. అధికారులు వారి నుంచి తీర్మానాలు తీసుకున్నారు. వీటిని ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని