logo

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు

సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ ఎం.విజయసునీత పేర్కొన్నారు.

Published : 17 Apr 2024 02:34 IST

కలెక్టర్‌ విజయసునీత

రంపచోడవరం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ ఎం.విజయసునీత పేర్కొన్నారు. స్థానిక గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంను కలెక్టర్‌ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే నెల 13న ఎన్నికల ముగిసిన వెంటనే ఈవీఎంలను, వీవీ ప్యాట్లను రంపచోడవరం తీసుకొచ్చేందుకు హెలికాప్టర్‌ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలో పోలింగ్‌కు అవసరమయ్యే సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.  399 పోలింగ్‌ కేంద్రాల్లో 59 సెక్టార్‌, 73 మంది రూట్‌ అధికారులను నియమించామన్నారు. సబ్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌కుమార్‌, తహసీల్దార్లు కృష్ణజ్యోతి, నాగరాజు, డీటీలు సత్యనారాయణ, చైతన్య, శ్రీధర్‌, విశ్వనాథం, శివ, సీఐ వాసా వెంకటేశ్వరరావు, ఎస్సై మోహన్‌కుమార్‌ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని