logo

సీఎం జగన్‌ రాక నేడు

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా తుని మీదుగా పాయకరావుపేటలోకి ప్రవేశిస్తుంది.

Published : 19 Apr 2024 01:55 IST

నక్కపల్లి, పాయకరావుపేట, చోడవరం న్యూస్‌టుడే: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా తుని మీదుగా పాయకరావుపేటలోకి ప్రవేశిస్తుంది. ఆయనకు స్వాగతం పలికేందుకు నర్సీపట్నం రోడ్డు కూడలి నుంచి ‘వై’ కూడలి వరకు స్థానిక నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి నుంచి యాత్ర నక్కపల్లి మండలం గొడిచెర్ల కూడలికి చేరుకుంటుంది. ఇక్కడే జాతీయ రహదారి పక్కన ఉన్న ఖాళీ స్థంలో రాత్రి బస చేయనున్నారు. గొడిచెర్ల వద్ద బసకోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం బస చేసే ప్రాంతాన్ని గురువారం రాత్రి ఎస్పీ మురళీకృష్ణ తదితరులు పరిశీలించారు. బస్సు ట్రయల్‌ రన్‌ వేసింది. చోడవరంలో శుక్రవారం నాటి సీఎం  సిద్ధం సభ వాయిదా పడినట్లు ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ  తెలిపారు.  మళ్లీ ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని