logo

దళితులకు జగన్‌ అన్యాయం

దళితులకు అన్యాయం చేసి దళిత ద్రోహిగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మారారని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్‌ అన్నారు.

Published : 19 Apr 2024 01:56 IST

మాట్లాడుతున్న సీఎం రమేశ్‌, పక్కన అనిత, తెదేపా నేతలు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: దళితులకు అన్యాయం చేసి దళిత ద్రోహిగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మారారని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్‌ అన్నారు. అనకాపల్లిలోని ఎంపీ ఎన్నికల కార్యాలయంలో చోడవరం, మాడుగుల నియోజకవర్గాల దళిత సంఘ నాయకులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. దళితులకు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన పథకాలను జగన్‌మోహన్‌రెడ్డి రద్దు చేశారన్నారు. వైకాపా హయాంలో దళితులపై దాడులు పెరిగిపోయాయన్నారు. దళిత సంఘ నాయకులు మాట్లాడుతూ చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో దళితుల పంతం.. వైకాపా అంతం నినాదంతో భారీ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నామని కోరారు. దీనిపై సీఎం రమేశ్‌ మాట్లాడుతూ సమావేశానికి తప్పనిసరిగా వస్తానని తెలిపారు. భాజపా జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, నాయకులు పరుచూరి భాస్కరరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని