కన్నాయిగూడెం ఎంపీటీసీ సభ్యుడి హత్య
కన్నాయిగూడెం మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఇందుకు పాతకక్షలే కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై శుక్రవారం వివరాలు వెల్లడించారు.
ఎటపాక, న్యూస్‌టుడే: కన్నాయిగూడెం మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఇందుకు పాతకక్షలే కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై శుక్రవారం వివరాలు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. వైకాపాకు చెందిన కన్నాయిగూడెం ఎంపీటీసీ సభ్యుడు వర్సా బాలకృష్ణ (43)కు, ఇదే గ్రామానికి చెందిన దారపునేని రమేశ్‌కు కొంత కాలంగా విభేదాలు ఉన్నాయి. గ్రామంలో గురువారం జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొన్న బాలకృష్ణ రాత్రి ఇంటికి వెళ్తున్నాడు. ఇదే సమయంలో కన్నాయిగూడెం గ్రామానికి చెందిన రమేశ్, భద్రాచలంకు చెందిన సాయి గ్రామ శివార్లలో మద్యం తాగుతున్నారు. అటుగా వచ్చిన బాలకృష్ణ వీరికి ఎదురుపడ్డారు.
ఈయన కూడా మద్యం మత్తులో ఉన్నాడు. పాతకక్షల నేపథ్యంలో వారి మధ్య మాటామాటా పెరిగి పెద్ద గొడవకు దారితీసిందని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో వీరి మధ్య తోపులాటతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సమయంలో మద్యం మత్తులో రమేశ్ పక్కనే ఉన్న బండరాయితో బాలకృష్ణ తలపై మోదటంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. హత్యానంతరం నిందితులు రమేశ్, సాయి అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహానికి భద్రాచలం ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిపించారు. బాలకృష్ణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ హత్యకు పాతకక్షలే కారణమని, మద్యం మత్తులో విచక్షణ కోల్పోవడమే హత్యకు దారితీసిందని ఎటపాక సీఐ రామారావు, ఎస్ఐ పార్థసారథి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్‌లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్‌లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్‌లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్‌రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్‌రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్