logo

అనంత బాబు అరాచకాలకు ముగింపు పలుకుదాం

ఎమ్మెల్సీ అనంత బాబు అరాచకాలతో మన్యం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, వైకాపాను ఓడించి ఆయన ఆట కట్టించడమే తమ లక్ష్యమని రంపచోడవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి స్పష్టంచేశారు.

Published : 20 Apr 2024 02:18 IST

తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిని శిరీషాదేవి

రంపచోడవరం, న్యూస్‌టుడే: ఎమ్మెల్సీ అనంత బాబు అరాచకాలతో మన్యం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, వైకాపాను ఓడించి ఆయన ఆట కట్టించడమే తమ లక్ష్యమని రంపచోడవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి స్పష్టంచేశారు. తెదేపా, భాజపా, జనసేన కూటమి నుంచి తెదేపా అభ్యర్థినిగా శిరీషాదేవి శుక్రవారం రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌కుమార్‌కు నామినేషన్‌ పత్రాన్ని అందజేశారు. నియోజకవర్గంలో 11 మండలాలకు చెందిన మూడు పార్టీల నాయకులు పెద్దఎత్తున ర్యాలీగా ఆర్వో కార్యాలయానికి తరలివచ్చారు. అంబేడ్కర్‌ కూడలి వద్ద శిరీషాదేవి మాట్లాడుతూ తనకు సైకిల్‌ గుర్తుపైన, భాజపా నుంచి అరకు ఎంపీగా పోటీ చేస్తున్న కొత్తపల్లి గీతకు కమలం గుర్తుపై  ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంత బాబు చేతిలో ఎమ్మెల్యే ధనలక్ష్మి కేవలం కీలుబొమ్మ అని విమర్శించారు.    మాజీ ఎమ్మెల్యే చిన్నం బాబూరమేష్‌, పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాసు, మాజీ పరిశీలకులు యర్రా వేణుగోపాలరాయుడు, నాయకులు కారం సురేష్‌బాబు, అడబాల బాపిరాజు, భాజపా నాయకులు స్వప్నకుమారి, జనసేన నాయకులు కుర్ల రాజశేఖరరెడ్డి, పాపోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఆస్తుల వివరాలు: రంపచోడవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి శుక్రవారం సబ్‌కలెక్టర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.ప్రశాంత్‌కుమార్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం తనకు చర, స్థిరాస్తుల కింద రూ.12,89,988లు, భర్త విజయభాస్కర్‌ పేరున రూ.11,49,000 మొత్తం రూ. 24,38,988 ఉన్నట్టు తెలిపారు. అలాగే అప్పుల కింద శిరీషాదేవికి రూ.1.10లక్షలు, భర్తకు రూ.8.12లక్షలు ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈమెపై ఎటువంటి కేసులు లేవు.

పాడేరు, న్యూస్‌టుడే: పాడేరు వైకాపా అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు తనపై కేసులేమీ లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ.9.44 లక్షల విలువైన చరాస్తులు, రూ. 16.27 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. 200 గ్రాముల బంగారం ఉందని చూపించారు. తన భార్య పేరిట రూ.1.20 లక్షల అప్పు ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని