logo

‘బినామీ పేర్లతో ముఖ్యమంత్రి దోపిడీ’

ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు.

Updated : 24 Apr 2024 04:53 IST

మాట్లాడుతున్న కొణతాల

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు. మామిడిపాలెంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధి పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని అక్కడే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి పనుల ద్వారా గ్రామస్థులకు ఎక్కువ గిట్టుబాటు అయ్యేలా చూస్తామని, సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తామన్నారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల్లోనే తెలుగు జాతి భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ కలిసి రావాలని కోరారు. తనకు గాజు గ్లాసు గుర్తుపై, ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేశ్‌కు కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ తనయుడు సీఎం రిత్విక్‌ మాట్లాడుతూ తన తండ్రి సీఎం రమేశ్‌ ఇచ్చిన హామీలన్నీ ఏడాదిలోనే అమలు చేసి తీరుతారన్నారు. అనకాపల్లి ప్రాంతంలో రూ. వేల కోట్లతో పరిశ్రమలు తీసుకువస్తారన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తారన్నారు. యువతకు ఉచిత నైపుణ్యాల శిక్షణ కేంద్రాలను ప్రారంభిస్తారన్నారు. శిక్షణ పొందిన వారందరికీ ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు. నాయకులు కరణం శ్రీనివాసరావు, ఆళ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని