logo

‘కేంద్రంలో మీ మద్దతు ఎవరికో చెప్పగలరా?’

అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ ప్రశ్నించారు.

Updated : 24 Apr 2024 04:50 IST

మాట్లాడుతున్న అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్‌

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ ప్రశ్నించారు. అనకాపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేరుకు బీసీలకు పదవులు ఇచ్చినా వారిని చులకనగా చూస్తున్నారని విమర్శించారు. ఇటీవల అనకాపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన సిద్ధం సభలో బూడికి మాట్లాడటానికి కనీసం మైకు కూడా ఇవ్వలేదన్నారు. అనకాపల్లి పార్లమెంట్లోని ప్రాంతాలపై తనకు అవగాహన లేదని బూడి మాట్లాడుతున్నారని, తనకు ఉన్న అవగాహన, నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తానో మీడియా సమక్షంలో చర్చించడానికి తాను సిద్ధమని, దీనికి ఆయన సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. ఏడు నియోజకవర్గాల్లో పోటీస్తున్న వైకాపా అసెంబ్లీ అభ్యర్థులతోపాటు ఆయన రావచ్చని, తాను ఒక్కడినే వచ్చి ఇక్కడి ప్రాంతాలు, నెలకొన్న సమస్యలపై మాట్లాడుతానన్నారు. తాను అనకాపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిసిన వెంటనే ఈ ప్రాంత సమస్యలతోపాటు వీటిని పరిష్కరించేలా ప్రణాళిక తయారు చేసుకున్నానని వివరించారు. యువతకు ఉపాధితోపాటు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. తెదేపా జిల్లా కమిటీ అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు, భాజపా జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, నాయకులు పరుచూరి భాస్కరరావు, కోట్ని బాలాజీ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని