ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్‌పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు.
విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్‌పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. ఇదే అంశంపై ఇద్దరు సీఓ (కమ్యూనిటీ ఆర్గనైజర్లు)లను, ఒక సోషల్ వర్కర్‌ను సస్పెండ్ చేశారు. ఆర్పీలు ఓటర్ల ఎపిక్ నెంబర్లు, ఆధార్‌కార్డులు, సెల్‌ఫోన్ నెంబర్లు సేకరించారన్న అభియోగాలపై కలెక్టర్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం ఇచ్చిన నివేదికలో కేవలం ఎనిమిది మందిపైనే చర్యలు తీసుకోవడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తూర్పు నియోజకవర్గంలో ఏపీడీలు దగ్గరుండి 165 మంది ఆర్పీలకు ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున వైకాపా అభ్యర్థి నుంచి డబ్బులు ఇప్పించినట్లు ఆరోపణలున్నాయి. వారంతా వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారని చెబుతున్నారు. మరో పక్క ముగ్గురు ఆర్పీలు వైకాపా కండువాలు వేసుకుని తిరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థికి అత్యంత సన్నిహితుడైన ఓ వైకాపా నాయకుడు చెప్పినట్లు ఆర్పీలు నడుచుకుంటున్నా జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్‌లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్‌లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్‌లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్‌రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్‌రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు