logo

ఏపీ ఎన్నికల్లో విజయంపై రూ.1.75 కోట్ల పందెం

ఓటర్ల తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉండగా గెలుపుపై నేతలు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు.

Updated : 19 May 2024 09:05 IST

పాయకరావుపేట, న్యూస్‌టుడే: ఓటర్ల తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉండగా గెలుపుపై నేతలు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. వారిపై ఆశలతో బెట్టింగురాయుళ్లు పెద్దఎత్తున పందేలు కాస్తున్నారు. పేట మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు భారీస్థాయిలో నగదు పందెం కాయడం అందరిలో ఆసక్తి రేపింది. రాజగోపాలపురం, రత్నాయంపేట (పెద్దూరు) గ్రామాలకు చెందిన ఇద్దరు  తెదేపా, వైకాపా విజయావకాశాలపై రూ.కోట్లలో పందెం కట్టారు. రాజగోపాలపురానికి చెందిన ఓ వ్యక్తి రాష్ట్రంలో తెదేపా, పేటలో అనిత గెలుపు ఖాయమని బెట్టింగు వేశారు. రత్నాయంపేటకు చెందిన మరో వ్యక్తి వైకాపాదే విజయమంటూ సై అన్నారు. వీరిద్దరూ రూ.1.75 కోట్ల చొప్పున పందెం కట్టడం విశేషం. శుక్రవారం రాత్రి పది మంది పెద్దమనుషుల సమక్షంలో కాగితాలు రాసుకున్నారు. కూటమి విజయావకాశాలపై గ్రామాల్లో బెట్టింగురాయుళ్లు జోరు మీదున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని