సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరణ
అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన గుత్తేదారు ఎన్.మణికంఠ నుంచి కొందరు వ్యక్తులు పొలీసులమని చెప్పి సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరించిన ఘటన సారవకోట మండలం ధర్మలక్ష్మీపురంలో శనివారం చోటుచేసుకుంది.
సారవకోట, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన గుత్తేదారు ఎన్.మణికంఠ నుంచి కొందరు వ్యక్తులు పొలీసులమని చెప్పి సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరించిన ఘటన సారవకోట మండలం ధర్మలక్ష్మీపురంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ జి.అప్పారావు ఆదివారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మణికంఠ గుత్తేదారుగా విశాఖపట్నంలో పనిచేస్తున్నాడు. ఈయనకు ఒడిశాకు చెందిన శ్రీధర్‌తో పరిచయమైంది. సారవకోట, పాతపట్నం ప్రాంతాల్లో తక్కువ ధరకే భూములు కొనుగోలు చేయవచ్చునని శ్రీధర్ నమ్మించాడు. భూమి చూపిస్తానని, సదరు భూములకు చెందిన వ్యక్తులకు కొంత మొత్తం అడ్వాన్సుగా చెల్లించాలని చెప్పడంతో మణికంఠ రూ.10 లక్షలు నగదు తీసుకుని వచ్చాడు. మణికంఠతో పాటు యువరాజు, మరో వ్యక్తి కలిసి సారవకోట మండలంలోని ధర్మలక్ష్మీపురం వద్ద శనివారం కారు నిలిపారు. పాతపట్నం వైపు నుంచి శ్రీధర్‌తో పాటు మరో ఇద్దరు వచ్చి మణికంఠను కలిశారు. పది నిమిషాల వ్యవధిలో పాతపట్నం వైపు నుంచి కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చి తాము పోలీసులమని పరిచయం చేసుకుని వాహనం తనిఖీ చేశారు. వాహనంలో ఉన్న రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకొని, ఎన్నికల వేళ ఇంత నగదు తరలించకూడదని, ఈ నగదును డీఎస్పీ కార్యాలయానికి అందజేస్తామని చెప్పి, శ్రీధర్‌తో పాటు ఆయనతో ఉన్న మరో ఇద్దరిని వాహనంలో ఎక్కించుకుని సారవకోట వైపు వెళ్లిపోయారు. కొంత సేపటి తరువాత శ్రీధర్‌కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన మణికంఠ సారవకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మణికంఠ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జి.అప్పారావు తెలిపారు. నరసన్నపేట సీఐ బి.ప్రసాదరావు సారవకోట పోలీస్‌స్టేషన్‌లో కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్‌లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్‌లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్‌లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్‌రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్‌రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్‌రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం