logo

సెలవుల్లో సరిగమలు.. బుడతల సరాగాలు

ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సంగీత శిక్షణపై మక్కువ చూపుతున్నారు. సెలవులను వృథా చేసుకోకుండా తమకు నచ్చిన రంగంలో శిక్షణ పొందేందుకు మక్కువ చూపుతున్నారు.

Published : 20 May 2024 02:00 IST

సంగీత శిక్షణపై బాలల్లో మక్కువ
అనకాపల్లిలో వేసవి శిక్షణ శిబిరాలు
అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

గిటార్‌ సాధనలో పిల్లలు

ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సంగీత శిక్షణపై మక్కువ చూపుతున్నారు. సెలవులను వృథా చేసుకోకుండా తమకు నచ్చిన రంగంలో శిక్షణ పొందేందుకు మక్కువ చూపుతున్నారు. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన సంగీత సాధన నేడు పట్టణాలకూ విస్తరించింది. విద్యార్థుల అభిరుచికి తగ్గట్టు నృత్యం, గిటార్‌, పియానో, గీతాలు ఆలపించడం, చిత్రలేఖనంలో చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. రోజూ క్రమం తప్పకుండా సాధన చేస్తూ దొరికిన సమయాన్ని వినియోగించుకుంటున్నారు. గతంలో వేసవి సెలవులు దొరికితే ఆటపాటలతో కాలం గడిపే విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా తగిన ప్రణాళిక వేసుకుంటున్నారు. సెలవుల్లో ఆడుకుంటునే తమ అభిరుచులకు అనుగుణంగా శిక్షణ తరగతులను వినియోగించుకుంటున్నారు. అనకాపల్లిలో సంగీత సాధనకు సంబంధించిన శిక్షణ తరగతులను మే 1 నుంచి జూన్‌ 10 వరకు నిర్వహిస్తున్నారు.

నృత్య సాధనలో ఉత్సాహంగా..


తమ్ముడితో కలిసి..

నేను ఆరో తరగతి. మా తమ్ముడు నాలుగో తరగతి. వేసవిలో సంగీత శిక్షణ ఇస్తున్నారని ఇక్కడికి వచ్చాం. ప్రతి రోజూ నృత్య సాధన చేస్తున్నాం. మెలకువలు నేర్పుతున్నారు.

ఆర్‌.సూర్యమిత్‌, రోషన్‌ సుభాష్‌


పాశ్చాత్య నృత్యంపై ఆసక్తి..

వేసవి సెలవులు వృథా కాకుండా సంగీత సాధనలో చేరాను. పాశ్చాత్య నృత్యం నేర్చుకుంటున్నా. వేసవిలో ఈ అవకాశం లభించడం ఆనందంగా ఉంది. పాఠశాలలు ఉన్నప్పుడు అవకాశం ఉండదు. సరైన సమయంలో శిక్షణ ఇవ్వడం బాగుంది.

కె.శ్రీజ, ఆరో తరగతి విద్యార్థిని


పియానో నేర్చుకుంటున్నా

నాకు పియానో అంటే చాలా ఇష్టం. నేర్చుకోవాలని ఉన్నా నేర్పించే వారు లేకపోవడంతో నిరాశ కలిగేది. వేసవి శిక్షణలో భాగంగా అనకాపల్లిలో నేర్పిస్తున్నారని చేరాను. ఇక్కడ తర్ఫీదు పొందుతా!  

ఎన్‌.తన్వీర్‌


శిక్షణ ఎంతో ఉపయోగపడుతోంది..

నాకు గిటార్‌ అంటే చాలా ఇష్టం. ఇందులో శిక్షణ తీసుకుంటున్నా. వేసవి సెలవుల్లో ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటున్న సమయంలో సంగీత సాధనపై శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని ఇక్కడ చేరాను. సంగీతంలో అందిస్తున్న శిక్షణ ఎంతో ఉపయోగపడుతోంది.

అనూష


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు