logo

వైభవోపేతంగా కల్యాణోత్సవం

అరకులోయలో వేంచేసిన అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు.

Published : 20 May 2024 02:03 IST

క్రతువు నిర్వహణ

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: అరకులోయలో వేంచేసిన అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కశింకోట మారుతి పీఠం నుంచి వచ్చిన వేజేటి శ్రీరామాచార్యులు, ఆలయ ప్రధానార్చకులు గణేష్‌ ఆధ్వర్యంలో ఉదయం స్థానిక బంగారు వ్యాపారి బుజ్జి నివాసంలో పెళ్లిమాటల తంతును సందడిగా నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ, ఉత్సవ కమిటీ పెద్దలు రఘునాథ్‌, అప్పలరాం, చందుపాడి, బాలాజీ రమేష్‌ తదితరులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో కంఠబంసుగుడ, స్థానిక యువత ప్రసాద వితరణ చేపట్టారు. పట్టణ ప్రధాన రహదారిపై వివిధ రకాల స్టాళ్లు ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని