logo

ఎగువగుడ్డిలో తాగునీటి ఎద్దడి

మంచినీటి సౌకర్యం కల్పించాలని రొంపల్లి పంచాయతీ ఎగువగుడ్డి గ్రామస్థులు ఆదివారం ఖాళీ బిందెలతో మెకాళ్లపై నిల్చుని ఆందోళన చేపట్టారు.

Published : 20 May 2024 02:03 IST

ఖాళీ బిందెలతో మోకాళ్లపై నిల్చుని ఆందోళన చేస్తున్న గ్రామస్థులు

అనంతగిరి, న్యూస్‌టుడే: మంచినీటి సౌకర్యం కల్పించాలని రొంపల్లి పంచాయతీ ఎగువగుడ్డి గ్రామస్థులు ఆదివారం ఖాళీ బిందెలతో మెకాళ్లపై నిల్చుని ఆందోళన చేపట్టారు. ఈ గ్రామంలో జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా మంచినీటి పథకం ఏర్పాటు చేసినప్పటికీ కుళాయిల ద్వారా కనీసం చుక్కనీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో చెలమనీటిపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. అలంకారప్రాయంగా ఉన్న కుళాయిల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది తప్ప ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని