logo

మోదకొండమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

మన్యం ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు.

Published : 20 May 2024 02:04 IST

బారులు తీరారిలా..

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: మన్యం ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారి ఉత్సవాలు ఈ నెల 19వ తేదీ నుంచి జరుగుతాయని ప్రచారం సాగడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్దఎత్తున విచ్చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఉత్సవాలను వచ్చే నెల 9వ తేదీ నుంచి నిర్వహించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఇప్పటికే భక్తజనం పెద్ద సంఖ్యలో బంధువల ఇళ్లకు చేరుకున్నారు. వీరంతా అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఆదివారం రోజున మొక్కులు తీర్చుకున్నారు. వేకువజాము నుంచే ఆలయంలో రద్దీ నెలకొంది. క్యూలైన్‌లో గంటలపాటు ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ, ఉత్సవ కమిటీ సభ్యులు ప్రసాదం పంచిపెట్టారు. మోదకొండమ్మ అమ్మవారి పాదాల వద్దకు పెద్దఎత్తున తరలివచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని