logo

సెలవుల్లో ఆడుతూ.. పాడుతూ!

వేసవి సెలవుల్లో పిల్లలు విద్యకు దూరం కాకూడనే ఉద్దేశంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

Published : 20 May 2024 02:08 IST

 

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: వేసవి సెలవుల్లో పిల్లలు విద్యకు దూరం కాకూడనే ఉద్దేశంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థుల అభిరుచి, ఆసక్తికి తగ్గట్లుగా డ్రాయింగ్‌, యోగా, ఆటలు వంటి వాటిపై ప్రత్యేక తర్ఫీదు అందించి వారికి విద్యపై ఆసక్తి పెంచడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రుల నంబర్లతో వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసి ఆన్‌లైన్‌ ద్వారా లేదా వీలైతే వారి ఇళ్లకు వెళ్లి వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు.

ప్రత్యేక శిక్షణ ఇలా..

  • ప్రతి పాఠశాల ఉపాధ్యాయులు తమ పరిధిలోని పిల్లల తల్లిదండ్రుల నంబర్లతో వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేస్తున్నారు.
  • ప్రతిరోజూ ఉపాధ్యాయులు ఇస్తున్న హోం వర్కు, ఇతర కార్యకలాపాలను విద్యార్థులు ఓ నోట్‌బుక్‌లో రాస్తున్నారు. అది పాఠశాల పునః ప్రారంభం రోజును సరిదిద్దాల్సి ఉంటుంది.
  • సమయం వృథా కాకుండా మంచి విజ్ఞానాన్ని పంచే పుస్తక సామగ్రి అందిస్తున్నారు. వారికి మంచి సలహాలు, సూచనలిస్తున్నారు.
  • విద్యార్థుల అభిరుచి మేరకు నోట్‌బుక్‌, వర్క్‌బుక్‌, ఆన్‌లైన్‌ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు.
  • యోగా, డాన్స్‌, డ్రాయింగ్‌పై శిక్షణ ఇస్తున్నారు.
  • డ్రాపవుట్‌ విద్యార్థులను బడుల్లో చేర్పిస్తున్నారు.
  • సెలవుల సమయంలో బాలలు చేసిన అంశాలపై పాఠశాల పునః ప్రారంభం రోజున ప్రదర్శన (ప్రజెంటేషన్‌) చేయాలి.
  • అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 2919 పాఠశాలల్లో 1,42,000 మంది విద్యార్థులకు వేసవి ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు తెలిపారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు ఈ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని