logo

గెలిచేది తెదేపా కూటమే

రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన పోలింగ్‌లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని, గెలిచేది తెదేపా కూటమేనని పాడేరు నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు.

Published : 20 May 2024 02:12 IST

తెదేపా నాయకులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన పోలింగ్‌లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని, గెలిచేది తెదేపా కూటమేనని పాడేరు నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ఆదివారం అంజలి శనివారం పంచాయతీకి చెందిన తెదేపా నాయకులు, కార్యకర్తలు పాడేరులోని నివాసంలో ఆమెను కలిశారు. ఈశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు గత ఐదేళ్లుగా తాము అనుభవించిన కష్టాలు, కన్నీళ్లకు ఓట్ల రూపంలో బదులిచ్చారన్నారు. పాడేరు నియోజకవర్గంలో తెదేపా భారీ మెజార్టీతో గెలుస్తుందని, అన్ని వర్గాల ప్రజలు తమను ఆదరించారని పేర్కొన్నారు. ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు పరమేశ్వరరావు, నారాయణరావు, చిరంజీవి, రమణమూర్తి, రాజారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని