logo

అరకు పర్యటకానికి కొత్తరూపు

ఆంధ్రాఊటీ అరకులోయలో ఐదు యూనిట్ల పరిధిలోని పర్యటకశాఖ అతిథిగృహాల మరమ్మతులకు అధికారులు చర్యలు చేపట్టారు.

Updated : 21 May 2024 09:45 IST

కొత్తరూపు సంతరించుకోనున్న మయూరి హిల్‌ రిసార్ట్స్‌

అరకులోయ, న్యూస్‌టుడే: ఆంధ్రాఊటీ అరకులోయలో ఐదు యూనిట్ల పరిధిలోని పర్యటకశాఖ అతిథిగృహాల మరమ్మతులకు అధికారులు చర్యలు చేపట్టారు. టైడాలో రూ. 4 కోట్లు, అనంతగిరిలో రూ. 6 కోట్లు, అరకులోయలోని మయూరి హిల్‌రిసార్ట్స్, పున్నమి వేలీ రిసార్ట్స్‌లకు రూ. 12 కోట్లు కేటాయించారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఆయా పనులకు టెండర్‌ పూర్తయ్యింది. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. టైడాలో పాడైన కాటేజీల స్థానంలో కొత్త కాటేజీలు, స్విమ్మింగ్‌ఫూల్, అనంతగిరిలోనూ స్విమ్మింగ్‌ఫూల్, అతిథిగృహాల మరమ్మతులు, అరకులోయలోని అమీబా కాటేజీలు, గిరిజన కళా గ్రామంలోని గదులు, మయూరి హిల్‌ రిసార్ట్స్, పున్నమి వేలీ రిసార్ట్స్‌ గదులకు మరమ్మతులు చేపడుతున్నారు. ఇంటీరియల్‌ సామగ్రిని సైతం నూతనంగా ఏర్పాటు చేస్తున్నారు. బొర్రాగుహల వద్ద దుకాణ సముదాయాలను బాగు చేయనున్నారు. బ్యాంకు రుణంతో ఈ పనులు చేపడుతున్నామని పర్యటక శాఖ ఈఈ రమణ తెలిపారు. అరకులోయ ప్రాంతాన్ని సందర్శించే అన్నివర్గాల వారికి గదులు అందుబాటులో ఉండేలా పనులు చేపట్టామన్నారు.  

గిరిజన కళా గ్రామంలో గదులకు రంగులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని