logo

దక్షిణ చైనాలో భారత్‌ ఆపరేషనల్‌ గస్తీ

దక్షిణ చైనా గస్తీలో భాగంగా ఫిలిప్పీన్స్‌లో భారత్‌ నౌకాదళం చేపట్టిన ఆపరేషనల్‌ గస్తీ పూర్తయినట్టు గురువారం నేవీ వర్గాలు తెలిపాయి. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ శక్తి, ఐఎన్‌ఎస్‌ దిల్లీ,

Updated : 24 May 2024 03:47 IST

ఫిలిప్పీన్స్‌లోని మనీలా తీరంలో ఐఎన్‌ఎస్‌ 

శక్తి నౌక వద్ద సిబ్బంది

సింధియా, న్యూస్‌టుడే : దక్షిణ చైనా గస్తీలో భాగంగా ఫిలిప్పీన్స్‌లో భారత్‌ నౌకాదళం చేపట్టిన ఆపరేషనల్‌ గస్తీ పూర్తయినట్టు గురువారం నేవీ వర్గాలు తెలిపాయి. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ శక్తి, ఐఎన్‌ఎస్‌ దిల్లీ, ఐఎన్‌ఎస్‌ కిల్తాన్‌ నౌకలు ఈస్ట్రన్‌ ఫ్లీట్‌ తరఫున అక్కడ గస్తీ విన్యాసాలు కొనసాగించినట్టు పేర్కొన్నాయి. ఇరుదేశాల భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా సంబంధాలను బలోపేతం చేసినట్టు వెల్లడించాయి. ఇరుదేశాల నౌకాదళ సిబ్బంది మధ్య సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి, క్రీడలు, సాంస్కృతిక పోటీలతో పాటు, సామాజిక అంశాలపై పలు కార్యక్రమాలు నిర్వహించినట్టు స్పష్టం చేశాయి. భారత్‌ నుంచి ఈస్ట్రన్‌ ఫ్లీట్‌ సీఓ రియర్‌ అడ్మిరల్‌ రాజేష్‌ ధనకర్, కమాండర్‌ ఫిలిప్పీన్స్‌ ఫ్లీట్‌ (సీపీఎఫ్‌) రియర్‌ అడ్మిరల్‌ రెనాటో డేవిడ్, అయిదో అడ్మిరల్‌ రొనాల్డ్‌ లిజర్‌ ఫుంజలన్, ఫిలిప్పీన్స్‌ తీరగస్తీదళం జూనియర్‌ కమాండెంట్, ఫ్లాగ్‌ ఆఫీసర్‌ వైస్‌అడ్మిరల్‌ టొరిబియో దులినయన్‌ తదితరులు సమావేశమై వివిధ అంశాలపై చర్చించినట్టు పేర్కొన్నాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు