logo

తెదేపాకు ప్రజల ఆదరణ: శిరీషాదేవి

రంపచోడవరంలో ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్‌రూంను తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి శుక్రవారం పరిశీలించారు.

Published : 25 May 2024 01:30 IST

రంపచోడవరం, న్యూస్‌టుడే: రంపచోడవరంలో ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్‌రూంను తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి శుక్రవారం పరిశీలించారు. స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్‌ కళాశాలలో అరకు పార్లమెంటు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ఉంచారు. వీటిని పరిశీలించేందుకు వచ్చిన శిరీషాదేవి విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రజలు మార్పు కోరుకున్నారని, తెదేపాను ఎంతగానో ఆదరించారని పోలింగ్‌ సరళితో స్పష్టమైందన్నారు. ఎన్నికల్లో తనకు సహకరించిన తెదేపా ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తెదేపా నాయకులు పండా చెల్లన్నదొర (బాబీ), మట్టా విజయభాస్కర్, పెంటపాటి అనంతమోహన్, వెదుళ్ల లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


చంద్రబాబు సీఎం కావడం ఖాయం

కొయ్యూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంతోపాటు పాడేరు నియోజకవర్గంలో ఎన్డీయే అభ్యర్థుల విజయం తథ్యమని తెదేపా మండల అధ్యక్షుడు జి.సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పార్టీ ఎస్టీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి రామ్మూర్తి, సీనియర్‌ నేత వై.వరహాలబాబు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ మండల అధ్యక్షుడు పి.సన్యాసిరావులతో కలిసి ఇక్కడి విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. వైకాపా పాలనతో విసుగుచెందిన ఉద్యోగులు, యువత, నిరుద్యోగులు, రైతులు, కార్మికులు, మహిళలు ఎన్డీయేను ఆదరించారన్నారు. కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని