logo

నివాసగృహాలపై నిర్లక్ష్యం

అరకులోయ ప్రాంతీయ వైద్యకేంద్రంలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది నివాసం ఉండేందుకు నిర్మిస్తున్న నివాసగృహాలు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.

Published : 25 May 2024 01:34 IST

అరకులోయ, న్యూస్‌టుడే: అరకులోయ ప్రాంతీయ వైద్యకేంద్రంలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది నివాసం ఉండేందుకు నిర్మిస్తున్న నివాసగృహాలు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రాంతీయ వైద్యకేంద్రం ఆవరణలో రూ. 65 లక్షలతో ఈ పనులను మూడేళ్ల క్రితం ప్రారంభించారు. అప్పటి ఐటీడీఏ పీవో బాలాజీ ప్రత్యేక దృష్టి సారించి నిర్మాణాలను స్లాబ్‌ దశ వరకు తీసుకొచ్చారు. అనంతరం ఆయన బదిలీపై వెళ్లిపోవటంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఈ ప్రాంతీయ వైద్యకేంద్రంలో ప్రస్తుతం 20 మంది వరకు వైద్యులు పనిచేస్తున్నారు. వారంతా నివాసం ఉండేందుకు పాత క్వార్టర్లు సరిపోవడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో బయట ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర సమయాల్లో రోగులకు వైద్యసేవలు అందాలంటే ఆసుపత్రి ఆవరణలోనే నివాసగృహాలు ఉండాలి. కొత్తగా నిర్మిస్తున్న భవనాలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయోనని వీరంతా ఎదురుచూస్తున్నారు. దీనిపై గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్‌ అధికారి అభిషేక్‌ని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. పనులు ప్రారంభించిన గుత్తేదారు సగం వరకు చేసి వదిలేశారన్నారు. ఆయనకు నోటీసులు జారీ చేసి తొలగించామన్నారు. నూతనంగా టెండర్లు ఆహ్వానించి వేరే గుత్తేదారుకు పనులు అప్పగించాల్సి ఉందని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని