logo

మండుటెండలో ముప్పుతిప్పలు!

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 424 పంచాయతీల పరిధిలో 1,28,565 మంది పనులు చేస్తున్నారు. ఉపాధి హామీ కూలీలకు గుడారాలు, మెడికల్‌ కిట్ల పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని డ్వామా పీడీ శివయ్య తెలిపారు.

Published : 25 May 2024 01:50 IST

ఉపాధి హామీ కూలీలకు  వసతుల కరవు

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 424 పంచాయతీల పరిధిలో 1,28,565 మంది పనులు చేస్తున్నారు. ఉపాధి హామీ కూలీలకు గుడారాలు, మెడికల్‌ కిట్ల పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని డ్వామా పీడీ శివయ్య తెలిపారు. ప్రస్తుతం ఎండలకు ఇబ్బందులు పడకుండా కూలీలు ఉదయం వేళల్లో పనులు చేయాలని సూచించామని చెప్పారు. 

పాడేరు, న్యూస్‌టుడే: పల్లెల్లో కూలీల వలసలను నివారించడంతోపాటు వారికి స్థానికంగానే పని కల్పించి వేతనాలు చెల్లించేలా గతంలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రారంభంలో దశలవారీగా కూలీలకు గడ్డపారలు, మెడికల్‌ కిట్లు, టెంట్లు (గుడారాలు), తాగునీరు వంటి వసతులు కల్పించారు. ప్రస్తుతం వారికి ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదు. ఇది వరకు కూలీలు సొంతంగా గడ్డపార సమకూర్చుకుంటే రోజుకు రూ.10, తాగునీటి కోసం రూ. 5 అందజేసేవారు. ఇప్పుడు పని ప్రదేశంలో కనీస వసతులు లేకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఎండ తీవ్రంగా ఉండటంతో కూలీలు వడదెబ్బకు గురవుతున్నారు. వేసవిలో మార్చి నుంచి జూన్‌ వరకు కూలీలకు వడదెబ్బ తగలకుండా టెంట్లు వేసి రక్షణ కల్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు అలసటగా ఉంటే పొదలు, చెట్ల చాటున సేద తీర్చుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ప్రభుత్వం స్పందించి  మెడికట్‌ కిట్లు, గుడారాలు ఏర్పాటు చేయాలని కూలీలు కోరుతున్నారు. 


వసతుల్లేవ్‌

- పాంగి రంభ, ఐటీడీఏ రేకుల కాలనీ, పాడేరు  

పని ప్రదేశంలో కూలీలకు ఎలాంటి పరికరాలు ఇవ్వడం లేదు. వసతుల్లేవు. గతంలో టెంట్లు, మెడికిల్‌ కిట్లు ఇచ్చేవారు. ఇప్పుడు  తాగడానికి నీరు కూడా మేమే తెచ్చుకుంటున్నాం. అలసటగా ఉంటే పొదలు, చెట్ల నీడన సేద తీరాల్సి వస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని