logo

ఎండు మాంసం తరలిస్తున్న 13 మంది అరెస్టు

అడవి జంతువుల ఎండు మాంసాన్ని ఒడిశాకు తరలిస్తున్న 13 మందిని అరెస్టు చేసినట్లు ఆర్‌వీనగర్‌ సబ్‌ డీఎఫ్‌వో బీఎన్‌ రాజు తెలిపారు.

Published : 25 May 2024 01:55 IST

చింతపల్లి గ్రామీణం, గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: అడవి జంతువుల ఎండు మాంసాన్ని ఒడిశాకు తరలిస్తున్న 13 మందిని అరెస్టు చేసినట్లు ఆర్‌వీనగర్‌ సబ్‌ డీఎఫ్‌వో బీఎన్‌ రాజు తెలిపారు. శుక్రవారం చింతపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా ఇర్తిగూడెం గ్రామానికి చెందిన 13 మంది గిరిజనులు వారం రోజుల కిందట ద్విచక్రవాహనాలపై కొయ్యూరు, గూడెంకొత్తవీధి సరిహద్దు అటవీ ప్రాంతానికి వచ్చారన్నారు.

అడవి దున్నలను వేటాడి మాంసాన్ని ఎండబెట్టి గోనె సంచుల్లో గురువారం సాయంత్రం స్వగ్రామానికి తరలిస్తుండగా గూడెంకొత్తవీధి పోలీసులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, ఏడు ద్విచక్రవాహనాలు, మూడు కత్తులు, సుమారు 400 కేజీల ఎండు మాంసాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితులను కోర్టుకు తరలించామన్నారు. రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు, ఎఫ్‌ఎస్‌ఓ బాబూరావు, చిరంజీవి, ఎఫ్‌బీఓ ఈశ్వరరావు పాల్గొన్నారు.

అంతకుముందు ఈ ఘటనపై గూడెంకొత్తవీధిలో విచారణ చేపట్టారు. చింతపల్లి పశువైద్యాధికారిణి హిమబిందును గూడెంకొత్తవీధి రప్పించి మాంసం నమూనాలు సేకరించారు. అటవీశాఖ అధికారులు చిరంజీవి, బాబూరావు, భద్రం, భూషణ్‌ పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని