logo

ఎగుమతులకు వీలుగా అటవీ ఉత్పత్తులు

గిరిజన రైతులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులతోపాటు వారు సేంద్రియ విధానాల ద్వారా పండిస్తున్న ఉద్యాన, వ్యవసాయ ఉత్పత్తులకు దేశీయంగానే కాక అంతర్జాతీయంగానూ మంచి గుర్తింపు ఉందని ఏపీ ఆహార శుద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.సుభాష్‌ పేర్కొన్నారు.

Updated : 26 May 2024 05:32 IST

పనస అనుబంధ తయారీ ఉత్పత్తులను పరిశీలిస్తున్న రాష్ట్ర ఆహార శుద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ సుభాష్‌

చింతపల్లి, న్యూస్‌టుడే: గిరిజన రైతులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులతోపాటు వారు సేంద్రియ విధానాల ద్వారా పండిస్తున్న ఉద్యాన, వ్యవసాయ ఉత్పత్తులకు దేశీయంగానే కాక అంతర్జాతీయంగానూ మంచి గుర్తింపు ఉందని ఏపీ ఆహార శుద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.సుభాష్‌ పేర్కొన్నారు. శనివారం లంబసింగిలో ఆయన పర్యటించారు. అక్కడకు సమీపంలోని రాజుపాకలులో లంబసింగి ట్రైబల్‌ ఫార్మô్్స ప్రొడ్యూసర్‌ కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనస పండ్ల నుంచి పచ్చళ్లు, చిప్స్, జామ్, జ్యూస్‌ వంటి అనుబంధ ఉత్పత్తుల తయారీని పరిశీలించారు. గిరిజన ప్రాంతాల్లో ఎగుమతులకు అనువైన అనేక పంటలు, వనరులు ఉన్నాయన్నారు. గిరిజన రైతులు పంటలను ముడి సరకుగానే విక్రయించడం వల్ల లాభాలు పొందలేకపోతున్నారని చెప్పారు. రైతులంతా సంఘాలుగా ఏర్పడి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారుచేసి ఎగుమతి చేస్తే మంచి ఫలితాలుంటాయని పేర్కొన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 5,200 మంది రైతులతోపాటు సంఘాలకు అనేక ప్రోత్సాహకాలు అందించామన్నారు. తాజాగా అల్లూరి జిల్లాలో మినీ కాఫీ బేబీ పల్పింగ్‌ యంత్రాలు 250 వరకూ రాయితీపై పంపిణీ చేశామని పేర్కొన్నారు. లంబసింగి ఎఫ్‌పీఓ ద్వారా గిరిజన మహిళలతో సుమారు 70 రకాల అనుబంధ ఉత్పత్తులు తయారు చేసి వాటిని ఎగుమతి చేస్తున్నట్లు కిసాన్‌ నెస్ట్‌ ఎండీ రాజేష్‌ తెలిపారు. ఎఫ్‌పీఓ డైరెక్టర్లు కూడా సరోజ, ఇందిర తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని