logo

విష వాయువుతో ఉక్కిరిబిక్కిరి

జాతీయ రహదారిపై అన్నవరం సమీప మండపం కూడలి వద్ద సోమవారం రాత్రి 8 గంటల సమయంలో జరిగిన ప్రమాదం వాహనదారులను హడలెత్తించింది.

Updated : 28 May 2024 02:09 IST

గంటపాటు తుని-అన్నవరం మధ్య నిలిచిన ట్రాఫిక్‌

ట్యాంకర్‌ నుంచి లీకవుతున్న హైడ్రోక్లోరిక్‌ లిక్విడ్‌తో పొగలు

తుని, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై అన్నవరం సమీప మండపం కూడలి వద్ద సోమవారం రాత్రి 8 గంటల సమయంలో జరిగిన ప్రమాదం వాహనదారులను హడలెత్తించింది. ఓ ట్యాంకరు లారీ నుంచి హైడ్రో క్లోరిక్‌ లిక్విడ్‌ ఒలికి, అది గ్యాస్‌గా లీకై, ఆ వాసనకు కొందరు అస్వస్థతకు గురయ్యారు. కొవ్వూరులోని ఓ రసాయన పరిశ్రమ నుంచి నక్కపల్లిలోని ఓ ఔషధ కంపెనీకి రసాయన లిక్విడ్‌తో వెళుతున్న ట్యాంకర్‌ను వెనుక నుంచి ఎల్‌పీజీ గ్యాస్‌ సిలెండర్లతో వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ముందు వాహనంలోని హైడ్రోక్లోరిక్‌ లిక్విడ్‌ పైప్‌ తెగి రోడ్డుపై పడింది. లిక్విడ్‌ ఒలికి, అది గ్యాస్‌గా మారి దుర్వాసనతో దట్టమైన పొగలు అలముకున్నాయి. రహదారిపై రాకపోకలు సాగిస్తున్న వాహనదారులకు కళ్ల మంటలు, ఊపిరాడని పరిస్థితి నెలకొంది. ట్యాంకర్‌ పక్కనే వెళ్తున్న ఓ ప్రైవేట్‌ పరిశ్రమకు చెందిన బస్సులోని కొందరు కార్మికులూ స్వల్ప అస్వస్థతకు గురవడంతో వారిని 108లో ఆసుపత్రికి తరలించారు. ఈ పరిణామంతో తుని-అన్నవరం మధ్య జాతీయ రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల పొడవున గంటపాటు వాహనాలన్నీ నిలిచిపోయాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని రోడ్డుపై ఒలికిన లిక్విడ్‌పై నీళ్లు చల్లడంతో గాఢత తగ్గింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని