logo

ఎంఎన్‌సీల్లో పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ఉద్యోగాలు

బహుళజాతి సంస్థల్లో (ఎంఎన్‌సీ) పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ఉద్యోగాలు లభిస్తున్నాయని రాష్ట్ర టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు.

Updated : 28 May 2024 02:09 IST

ఉద్యోగాలు పొందిన విద్యార్థులతో రాష్ట్ర టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌
కమిషనర్‌ నాగరాణి తదితరులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే:  బహుళజాతి సంస్థల్లో (ఎంఎన్‌సీ) పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ఉద్యోగాలు లభిస్తున్నాయని రాష్ట్ర టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. కంచరపాలెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో సోమవారం నిర్వహించిన ఉద్యోగ విజయోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు పూర్తి చేసేందుకు పలు సంస్థలు అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 2023-24 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన వారిలో 12 వేల మంది వివిధ పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందడం అభినందనీయమన్నారు. వీరిలో అనేక మంది రూ.8 లక్షల వార్షిక వేతనం అందుకున్నారని, సగటు వేతనం ప్యాకేజీ రూ.3 లక్షలు ఉందన్నారు. కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్‌ డైరెక్టర్‌ జి.వి.ఎన్‌.ప్రసాద్, ఒడిన్‌ కంట్రోల్‌ ఎండీ ఎస్‌.నందగోపాల్, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం గణపతి, రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఉపసంచాలకులు డాక్టర్‌ ఎం.ఎ.వి.రామకృష్ణ, సాంకేతిక విద్యా శిక్షణ మండలి ఎగ్జామినేషన్స్‌ కంట్రోలర్‌ జానకి రామయ్య, కళాశాల ప్రిన్సిపల్‌ కె.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు