logo

మనుమరాలిపై అత్యాచారం.. తాతకు 20 ఏళ్ల జైలు

మనుమరాలిపై అత్యాచారానికి పాల్పడిన కీచక తాతకు 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.5 లక్షల జరిమానా విధిస్తూ విశాఖ పోక్సో న్యాయస్థానం (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌) ప్రత్యేక న్యాయమూర్తి జి.ఆనందిని తీర్పునిచ్చారు.

Updated : 28 May 2024 02:08 IST

విశాఖ లీగల్, న్యూస్‌టుడే: మనుమరాలిపై అత్యాచారానికి పాల్పడిన కీచక తాతకు 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.5 లక్షల జరిమానా విధిస్తూ విశాఖ పోక్సో న్యాయస్థానం (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌) ప్రత్యేక న్యాయమూర్తి జి.ఆనందిని తీర్పునిచ్చారు. నిందితుడి నుంచి వసూలు చేసిన రూ.5 లక్షలు బాధితురాలికి నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించారు. పోక్సో న్యాయస్థానం ప్రత్యేక పబ్లిక్‌ ప్రాపిక్యూటర్‌ కరణం కృష్ణ తెలిసిన వివరాలిలా ఉన్నాయి.. విశాఖ నగర పరిధి మల్కాపురం, జాలారిపేటకు చెందిన విశ్రాంత ఉద్యోగి (68) మూడు అంతస్తుల భవనంలో ఇద్దరు కుమారులతో నివసించేవాడు. ఓ కుమారుడి పెద్ద కుమార్తె(12) ఐదో తరగతి చదివేది. కుమారుడు ఉద్యోగానికి వెళ్లినప్పుడు విశ్రాంత ఉద్యోగి మనుమరాలిని మొదటి అంతస్తుకి తీసుకువెళ్లి భయపెట్టి అత్యాచారం చేసేవాడు. విషయం బయటకు చెబితే తల్లిదండ్రులు, చెల్లెలు, నానమ్మను చంపేస్తానని బెదిరించేవాడు. అలా దాదాపు 15సార్లు అత్యాచారం చేశాడు. 2017 అక్టోబరు 1న అత్యాచారానికి పాల్పడుతుండగా బాధితురాలి సోదరి చూసి తల్లికి చెప్పింది. ఆమె మొదటి అంతస్తుకు రావడంతో విశ్రాంత ఉద్యోగి టవల్‌ చుట్టుకుని బాత్‌రూమ్‌లోకి వెళ్లిపోయాడు. కుమార్తెను కిందికి తీసుకువెళ్లి ఏం జరిగిందో చెప్పాలని కోరడంతో ఆమె జరిగిన విషయం మొత్తం చెప్పింది. ఈ మేరకు తల్లి బాధిత కుమార్తెతో కలిసి మల్కాపురం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని న్యాయస్థానంలో హాజరు పరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి పైవిధంగా శిక్ష విధించారు.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు