logo

‘ఉపేంద్రగాడి అడ్డా’ సందేశాత్మక సినిమా

ఎస్‌ఎస్‌ఎల్‌ఎస్‌ క్రియేషన్‌ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మించిన ‘ఉపేంద్ర గాడి అడ్డా’ చిత్రం సక్సెస్‌ మీట్ కార్యక్రమం మంగళవారం డాబాగార్డెన్స్‌ అల్లూరిసీతారామరాజు విజ్ఞానకేంద్రంలో నిర్వహించారు.

Published : 06 Dec 2023 02:55 IST

హీరో, నిర్మాతలను సన్మానిస్తున్న నిర్వాహకులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఎస్‌ఎస్‌ఎల్‌ఎస్‌ క్రియేషన్‌ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మించిన ‘ఉపేంద్ర గాడి అడ్డా’ చిత్రం సక్సెస్‌ మీట్ కార్యక్రమం మంగళవారం డాబాగార్డెన్స్‌ అల్లూరిసీతారామరాజు విజ్ఞానకేంద్రంలో నిర్వహించారు. ఈ సినిమా ఈనెల ఒకటో తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. సైబర్‌ మోసాలు, నేరాలపై యువత అప్రమత్తంగా ఉండాలనే సందేశంతో చిత్రం రూపుదిద్దుకుందని నిర్మాత తెలిపారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నిర్మాత అచ్యుతరావు, హీరో ఉపేంద్ర, హీరోయిన్‌ సావిత్రికృష్ణ, నటులు సుబ్బలక్ష్మి, సునీత, మురళీధర్‌గౌడ్‌ తదిరతులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని