logo

మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలి

మిగ్‌జాం తుపాను తీవ్రత ఇంకా తగ్గని నేపథ్యంలో తీరప్రాంతాల్లో  మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక ఉప కలెక్టర్‌ మహేష్‌ సూచించారు.

Published : 06 Dec 2023 02:57 IST

అధికారులతో మాట్లాడుతున్న ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ మహేష్‌

ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: మిగ్‌జాం తుపాను తీవ్రత ఇంకా తగ్గని నేపథ్యంలో తీరప్రాంతాల్లో  మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక ఉప కలెక్టర్‌ మహేష్‌ సూచించారు. రేవుపోలవరం తీరాన్ని అధికారులతో కలిసి మంగళవారం ఆయన సందర్శించారు. పూరిళ్లు, గుడిసెల్లో ఎవరూ నివాసం ఉండకూడదని, తుపాను రక్షిత భవనానికి రావాలని సూచించారు. సమస్యలు ఏవైనా ఉంటే మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజాప్రతినిధులకు తెలిపారు. తుపాను తీవ్రత తగ్గేవరకు అధికారులు సైతం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ విజయ్‌ కుమార్‌, ఎంపీడీఓ రామచంద్రమూర్తి, ఈఓఆర్డీ సత్యనారాయణ, కొత్త రేవుపోలవరం సర్పంచి మల్లే లోవరాజు, వీఆర్వోలు తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు