logo

రానున్న 24 గంటలూ అధికారులంతా అప్రమత్తం

మిగ్‌జాం తుఫాను ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారంతా అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీఓ వి.అభిషేక్‌ ఆదేశించారు.

Published : 06 Dec 2023 02:59 IST

మాట్లాడుతున్న పీఓ అభిషేక్‌

పాడేరు, న్యూస్‌టుడే: మిగ్‌జాం తుఫాను ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారంతా అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీఓ వి.అభిషేక్‌ ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడుతూ తఫాను బలహీన పడుతున్న సమయంలో అధికారంగా వర్షం కురుస్తుందన్నారు. వాగులు, గెడ్డలు పొంగిపారుతాయని ఏజెన్సీలో ఎవరూ గెడ్డలు దాటి ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతగిరి, పాడేరు, చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో రాత్రి సమయాల్లో ఘాట్‌రోడ్డు ప్రయాణాలు నియంత్రించాలన్నారు. అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండి పరిస్థితులను ఇప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో సచివాలయం సిబ్బంది,వాలంటీర్లును అప్రమత్తం చేయాలని ఆదేశించారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు గ్రామాల్లోనే ఉండాలన్నారు. వైద్య సిబ్బంది స్థానికంగా ఉండి అవసరమైన వైద్య సేవలు అందించాలని సిద్దంగా ఉండాలన్నారు. ఏజెన్సీలో ఎక్కడా ప్రాణ, ఆస్తి, పశు సంపదకు నష్టం వాటిలకుండా ప్రజలను చైతన్యం  చేయాలని ఆదేశించారు. రహదారులకు అడ్డంగా చెట్లు, నెలకొరిగితే వెంటనే తొలగింపునకు చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్తు సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని, తీగలు తెగిపోతే సకాలంలో పనరుద్ధరణ  పనులు చేపట్టాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని