logo

మహాసభలకు భారీగా తరలింపు

విజయవాడలో జరనున్న ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల రాష్ట్ర మహాసభలకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా తరలివెళ్లాలని సంఘం నేతలు నిర్ణయించారు.

Published : 06 Dec 2023 03:02 IST

ప్లకార్డులు చూపుతున్న సంఘ నాయకులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: విజయవాడలో జరనున్న ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల రాష్ట్ర మహాసభలకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా తరలివెళ్లాలని సంఘం నేతలు నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం కలెక్టరేట్‌ ఆవరణలోని రెవెన్యూ భవన్‌లో జరిగిన సన్నాహక సమావేశంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, పాడేరు, విశాఖ జిల్లాలకు చెందిన పలువురు నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈనెల 9న బయలుదేరి విజయవాడ తరలివెళ్లాలని నిర్ణయించారు. ఏపీ జేఏసీ అమరావతి విశాఖ జిల్లా ఛైర్‌పర్సన్‌ ఎస్‌.నాగేశ్వరరెడ్డి, విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కేఎస్‌ రావు, కోశాధికారి రవిశంకర్‌, పొరుగు సేవల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుమన్‌, రాష్ట్ర నాయకులు అప్పలరాజు, రవి, శ్రీనుబాబు పాల్గొన్నారు. డిమాండ్ల సాధనకు అవసరమైతే ఆందోళనకు దిగాలని పలువురు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని