logo

నష్టపోయిన పంటలకు పరిహారం అందిస్తాం

ఏజెన్సీలో వరి సాగుచేసిన రైతులు తుపాను వల్ల ఎంత నష్టపోయింది అంచనా వేస్తున్నామని  సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన రంప గ్రామంలో రైతులు సాగుచేసిన వరి పొలాలను పరిశీలించారు.

Published : 07 Dec 2023 02:05 IST

సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌

రంపచోడవరం, న్యూస్‌టుడే: ఏజెన్సీలో వరి సాగుచేసిన రైతులు తుపాను వల్ల ఎంత నష్టపోయింది అంచనా వేస్తున్నామని  సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన రంప గ్రామంలో రైతులు సాగుచేసిన వరి పొలాలను పరిశీలించారు. ఎన్ని ఎకరాల్లో ధాన్యం పండించింది...ఎంత కోశారు...ఇంకా ఎన్ని ఎకరాలు కోయాల్సి ఉంది అని రైతుల నుంచి ఆరాతీశారు.  నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వ్యవసాయాధికారులతో సమీక్షించి చర్యలు తీసుకొంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని