logo

నిలువ నీడలేని అంబులెన్స్‌!

మన్యంలోని గిరిజన గ్రామాల్లోని ప్రజలకు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు తలెత్తినా, సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు (పీహెచ్‌సీ) తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆయా పీహెచ్‌సీలకు ప్రభుత్వం అంబులెన్సులు సమకూర్చింది.

Published : 07 Dec 2023 02:07 IST

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మన్యంలోని గిరిజన గ్రామాల్లోని ప్రజలకు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు తలెత్తినా, సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు (పీహెచ్‌సీ) తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆయా పీహెచ్‌సీలకు ప్రభుత్వం అంబులెన్సులు సమకూర్చింది. మారేడుమిల్లి పీహెచ్‌సీకి కూడా అంబులెన్స్‌ సమకూర్చారు. ఇక్కడి పరిస్థితులకు అనువుగా ఉండేందుకు బొలేరో వాహనాన్ని ఏర్పాటు చేశారు. అయితే దీనికి కనీసం షెడ్డు కూడా నిర్మించలేదు. దీనితో పీహెచ్‌సీ ఎదురుగానే ఎండ, వానల్లో ఉంటోంది. ఈ కారణంగా తరచూ మరమ్మతుకు గురై మెకానిక్‌ షెడ్డుకే పరిమితం అవుతోంది. ఇటీవల రంపచోడవరంలో మరమ్మతు చేయించి వసతి సదుపాయం లేకపోవడంతో ఎండా, వానల్లో ఉంటోంది. లోతట్టు గ్రామాల ప్రజల ఆరోగ్య పరిస్థితులను, వారికి అందించాల్సిన వైద్య సేవలను దృష్టిలో ఉంచుకుని, అంబులెన్సుకు షెడ్డు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని