logo

గెడ్డలో ముగ్గురి గల్లంతు

ఉప్పొంగి ప్రవహిస్తున్న గెడ్డను దాటేందుకు ప్రయత్నించి ముగ్గురు గిరిజనులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం గుర్తించారు. ఎంపీడీఓ శ్రీహర్షిత్‌, స్థానికులు అందించిన వివరాల ప్రకారం...

Published : 07 Dec 2023 02:08 IST

ఒకరి మృతదేహం గుర్తింపు
అనంతగిరి/గ్రామీణం, న్యూస్‌టుడే:  ఉప్పొంగి ప్రవహిస్తున్న గెడ్డను దాటేందుకు ప్రయత్నించి ముగ్గురు గిరిజనులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం గుర్తించారు. ఎంపీడీఓ శ్రీహర్షిత్‌, స్థానికులు అందించిన వివరాల ప్రకారం... భీంపోలు పంచాయతీ సీతపాడు గ్రామానికి చెందిన గెమ్మెల లక్ష్మి(52), మిర్యాల కమల(40), గెమ్మెల కుమార్‌(25) బుధవారం కాశీపట్నం వారపు సంతకు వెళ్లారు. తిరిగి ఆటోలో ఇంటికి వెళుతుండగా లువ్వాగెడ్డ సమీపానికి వచ్చేసరికి గెడ్డ ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆటోను డ్రైవర్‌ నిలిపివేశాడు. ఈ ముగ్గురు తమకు అలవాటేనని చేతులు పట్టుకుని గెడ్డను దాటేస్తామని చెప్పగా డ్రైవర్‌ వద్దని వారించాడు. అయినప్పటికీ వారు వినకుండా ఉద్ధృతంగా ప్రవహిసున్న గెడ్డను దాటుతున్న క్రమంలో గల్లంతయ్యారు. అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. వీరిలో కుమార్‌ మృతదేహం కాశీపట్నం సమీపంలో బయటపడగా మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. ముగ్గురు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తహసీల్దారు రాంబాయి, ఆర్‌ఐ శంకరావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని