logo

దొంగతనాలపై అప్రమత్తం: సీఐ

దొంగతనాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రంపచోడవరం సీఐ వాసా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. దేవీపట్నం మండలం కొండమొదలు ఆర్‌అండ్‌ఆర్‌ పునరావాస కాలనీలో పోలవరం నిర్వాసితులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Published : 07 Dec 2023 02:21 IST

దేవీపట్నం, న్యూస్‌టుడే: దొంగతనాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రంపచోడవరం సీఐ వాసా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. దేవీపట్నం మండలం కొండమొదలు ఆర్‌అండ్‌ఆర్‌ పునరావాస కాలనీలో పోలవరం నిర్వాసితులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా మోసాలకు గురికావద్దని నిర్వాసితులకు సూచించారు.. డ్రైవింగ్‌ లైసెన్సులు లేనివారికి తల్లి తండ్రులు ద్విచక్రవాహనాలు ఇవ్వరాదని వివరించారు. అనంతరం నిర్వాసితులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో ఎస్సై కె.వి.నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని