logo

పేరుకే ప్రారంభం.. ఏదీ ఉపయోగం?

ఆంధ్రాఊటీ అరకులోయను సందర్శించే పర్యటకులు విడిది చేసేందుకు పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో అరకులోయకు సమీపంలోని కొత్తవలస ఉద్యానంలో సుమారు రూ. 25 లక్షలు వెచ్చించి కాటేజీలు నిర్మించారు.

Published : 07 Dec 2023 02:24 IST

అరకులోయ, న్యూస్‌టుడే: ఆంధ్రాఊటీ అరకులోయను సందర్శించే పర్యటకులు విడిది చేసేందుకు పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో అరకులోయకు సమీపంలోని కొత్తవలస ఉద్యానంలో సుమారు రూ. 25 లక్షలు వెచ్చించి కాటేజీలు నిర్మించారు. పనులు పూర్తి కాకుండానే సుమారు ఏడాది క్రితం గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే చేతులమీదుగా ప్రారంభోత్సవం సైతం చేసేశారు. ఇప్పటికీ తుది దశ పనులపై అధికారులు దృష్టి సారించలేదు.

ప్రస్తుతం కాటేజీలు నిరుపయోగంగా ఉన్నాయి. వాస్తవానికి సీజన్‌లో అతిథిగృహాలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. ప్రస్తుతం పర్యటక సీజన్‌ సాగుతోంది. ఈ సమయంలోనూ పనులు పూర్తి చేయించకుండా కాటేజీలు నిరుపయోగంగా అధికారులు వదిలేయటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫర్నిచర్‌ సైతం గదుల్లోనే మగ్గుతోంది. కాటేజీల కోసమే ప్రత్యేకంగా రోడ్డు, విద్యుత్తు సరఫరాని అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా పాడేరు ఐటీడీఏ అధికారులు స్పందించి వీటిని అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని